- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే భారీ విజయం.. విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈ విజయోత్సవ వేళ నటి త్రిష, విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే (TVK)ఆవిర్భవించింది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు చెక్ పెడుతూ తలపతి విజయ్ సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు వ్యూహాల వర్షం కురుస్తోంది.
విజయ్ నివాసంలో సందడి.. త్రిష అభినందనలు
ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో విజయ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా ప్రముఖ నటి త్రిష (Trisha) విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విజయ్, త్రిష స్క్రీన్‌పై సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానంలోనూ ఆమె అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉదయం శ్రీవారి సేవలో త్రిష..
విజయ్ నివాసానికి వెళ్లడానికి ముందు త్రిష తిరుమల (Tirumala)లో పర్యటించారు. ఇవాళ ఉదయమే వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. టీవీకే సాధించిన విజయానికి మొక్కులు చెల్లించుకున్నట్లుగా సమాచారం. దర్శనం అనంతరం నేరుగా చెన్నై చేరుకున్న త్రిష, నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు.






