- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో విజయ్ కి మరో ఎదురుదెబ్బ...కేబుల్ టీవీలో ‘జన నాయగన్’ ప్రదర్శన!
హీరో విజయ్ జన నాయగన్ సినిమాను కేబుల్ టీవీలో ప్రసారం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ హీరో విజయ్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ సినిమాకు మరోసారి తగిలింది. ఆయన నటించిన జన నాయగన్ సినిమాను కేబుల్ టీవీలో ప్రసారం చేశారు. ఇటీవల ఆన్లైన్ లో లీకైన ఫుటేజ్ ని కోయంబత్తూర్ లో రాశి కేబుల్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్న పళని స్వామి అనే వ్యక్తి, కేబుల్ టీవీలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేశారు. ఇక మరోవైపు జన నాయగన్ సినిమా లీక్ కేసులో ఆరుగురు నిందితులు అరెస్టు అయ్యారు. మొత్తం 300కు పైగా లింకులను ఇంటర్నెట్ నుంచి అధికారులు తొలగించారు. కాగా ఈ జన నాయగన్ సినిమా రిలీజ్ పదే పదే వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు, ఇతర వివాదాల కారణంగా ఈ సినిమా మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.






