- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vaishnavi Chaitanya: స్టేజ్‌పై నోరు జారి బూతు మాట అన్న హీరోయిన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack)

దిశ, సినిమా: సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack). ఈ మోస్ట్ వెయిటెడ్ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తుంది. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ‘జాక్’ నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుసగా ఈవెంట్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రజెంట్ ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
ఈ మేరకు వైష్ణవి మాట్లాడుతూ.. ‘మా ‘జాక్’ ఈవెంట్‌ను మీ అందరి ముందు, మీ ఎనర్జీతో షేర్ చేసుకుంటున్నందుకు.. మీ రాజమండ్రి (Rajahmundry)లో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెబుతుంది. అయితే.. ‘జాక్’ టీమ్ భీమవరం (Bhimavaram) ఈవెంట్‌లో పాల్గొనగా.. ఆ పేరుకు బదులుగా వైష్ణవి రాజమండ్రి అని చెప్పడంతో.. అది సరిచేసే ప్రయత్నంగా సిద్ధు జొన్నలగడ్డ ముందుకు వచ్చి భీమవరం అని చెప్తాడు. అప్పుడు ‘హో ఫక్’ మర్చిపోయా.. అంటూ కవర్ చేసుకుంటోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. స్టేజ్ మీద అంతమంది ముందు ఉన్నామనే విషయం కూడా మర్చిపోయి ‘హో ఫక్’ అనడం ఏంటీ.. దానికి మీనింగ్ ఏంటో తెలియదా అంటూ సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Read More..
స్టన్నింగ్ లుక్స్‌లో యంగ్ బ్యూటీ.. ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ అంటూ కామెంట్స్






