సాయి ప‌ల్ల‌విపై దారుణంగా ట్రోల్స్‌.. హింది రాదంటూ !

by velandi.Saikiran |

ఏక్ దిన్ సినిమా ఈవెంట్ లో నటి సాయి పల్లవి హిందీ మాట్లాడడానికి ఇబ్బంది పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

సాయి ప‌ల్ల‌విపై దారుణంగా ట్రోల్స్‌.. హింది రాదంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్: సౌత్ ఇండస్ట్రీని దున్నేస్తున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017లో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార‌ సాయి పల్లవి... ఆ తర్వాత వరుస హిట్లతో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోలతో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. సాయి పల్లవి ఏ సినిమా చేసిన మినిమం గ్యారెంటీ ఉంటుంది. అయితే అలాంటి సాయి పల్లవిపైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆమెకి హిందీ రాదని ఆడుకుంటున్నారు.

సాయి పల్లవికి ఘోర అవమానం !

టాప్ హీరోయిన్ సాయి పల్లవికి ఊహించని పరిణామం ఎదురయింది. ఏక్ దిన్ సినిమా ఈవెంట్ లో నటి సాయి పల్లవి హిందీ మాట్లాడడానికి ఇబ్బంది పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సాయి పల్లవికి హిందీపై పట్టు లేకపోవడాన్ని నెటిజెన్స్ విమర్శిస్తున్నారు. హిందీ సరిగ్గా మాట్లాడలేని సాయి పల్లవిని రామాయణ సినిమాలో సీత పాత్రకు ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే సాయి పల్లవిని ఈ ప్రాజెక్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. భాష రాకపోయినా నటనలో సాయిపల్లవి దిట్ట అని కొనియాడుతున్నారు. కేవలం భాషను చూసి ప్రతిభను అంచనా వేయలేమని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఇటీవల ఆమె నటించిన ఏక్ దిన్ సినిమా మే ఒకటో తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రామాయణ ప్రాజెక్టులో సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారట. ఈ సినిమా దీపావళికి రానుంది.



Next Story