- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నావు అని ట్రోలింగ్.. మ్యారేజ్ కాకుండానే డివోర్స్ అంటూ శుభశ్రీ ఎమోషనల్ కామెంట్స్
బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సీజన్-7లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి తన క్యూట్ క్యూట్ మాటలతో అక్కడి వారిని పడేసింది. అలాగే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలా తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఈ బ్యూటీ సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ షో ద్వారానే బాగా ఫేమస్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడైన అజయ్ మైసూర్ అలియాస్ ఏజే మైసూర్‌తో రీసెంట్‌గా నిశ్చితార్థం చేసుకుంది.
ఇక అతను సినీ రంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ చూసిన తర్వాత డబ్బుల కోసమే ఆమె అతన్ని చేసుకుంటుంది, నల్లగా ఉన్నవాడిని, లావు ఉన్నవాడిని ఎందుకు చేసుకుంటుంది, మనీ కోసమే అంటూ పలువురు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు. ఇక దీనిపై ఈ బ్యూటీ తాజాగా స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నల్లగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని చేసుకుంటున్నారు అని కామెంట్స్ చేశారు. మీకు ఎంత ధైర్యం? అసలు మీరెవరు నా లైఫ్‌లో ఎవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అని. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు డబ్బు ఉన్నవాళ్లు.
నా దగ్గర డబ్బు ఉంది, కారు, ఇల్లు ఉంది. అయినా ఇండియాలో చాలా మంది అబ్బాయిలు నల్లగానే ఉంటారు. లావు ఉన్నాడని కామెంట్స్ చేశారు. ఆయన మంచి ఫుడీ. జిమ్‌కి వెళ్తే తగ్గుతారు. ఆయనకు అలా ఉండటం ఇష్టం, మీకెందుకు. నేను అబ్బాయి మంచిగా ఉన్నాడా , రెస్పెక్ట్ ఇస్తున్నాడా, టాక్సిక్ లేడా ఇలాంటివి చూస్తా. ఆయనతో నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఈ 9 నెలల్లో ఎక్కువగా ఏడవలేదు. ఆయన నాతో మంచిగా ఉంటారు. నన్ను ఏడిపించట్లేదు. ఆ ట్రోల్స్ చూసాను. నా వల్ల కాదు అని అవాయిడ్ చేశాను.
ఆయనకు కూడా ఇలాగే చెప్తున్నారు. నాకేం డబ్బులు ఆయన ఇవ్వట్లేదు. నేను ఆయనకు ఇవ్వట్లేదు. మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటున్నాము. నిశ్చితార్థంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తే ఆయనకు డ్యాన్స్ రాదు అని ట్రోల్ చేశారు. ఆయనకు వచ్చినట్టు ఆయన చేస్తారు నీకెందుకు. మాకు ఇవన్నీ అనవసరం. మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము. అలాంటి వాళ్లకు ఏం చెప్పలేము. ట్రోల్ చేసినవాళ్లు వాళ్ళ పార్టనర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్లకు తెలుస్తుంది.
ఈ ట్రోల్స్ చూసి ఏడ్చాను. పెళ్లి కూడా కాకుండానే డైవర్స్ గురించి మాట్లాడతారు. ఎందుకు అంత నెగిటివిటీ. మా ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళందరికీ ఎందుకు. మా డబ్బులు మా ఇష్టం, మా నిశ్చితార్థం, మా లవ్‌ని సెలబ్రేట్ చేసుకున్నాం మీకెందుకు. మా ఫ్యామిలీస్ కూడా బాధపడ్డాయి. మాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి. మేము ఎలా ఉన్నామో మాకు తెలుసు, మీరు జడ్జ్ చేయక్కర్లేదు. ఇంత క్రూరంగా ఉండకండి అంటూ తమపై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






