రాబిన్ హుడ్, మ్యాడ్ 2 పై ట్రోలింగ్.. అడ్డంగా దొరికిపోయారు గా!

by velandi.Saikiran |

రెండు తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు సినిమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. హీరో నితిన్ (Nithin) నటించిన

రాబిన్ హుడ్, మ్యాడ్ 2 పై ట్రోలింగ్.. అడ్డంగా దొరికిపోయారు గా!
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రంలో ప్రస్తుతం రెండు సినిమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. హీరో నితిన్ (Nithin) నటించిన రాబిన్ హుడ్ (Robin Hood), అలాగే మ్యాడ్ 2 ( Mad Square ) సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతున్నాయి. రెండు సినిమాలు కూడా మార్చి 28వ తేదీన అంటే శుక్రవారం రోజున రిలీజ్ అయ్యాయి. మ్యాడ్ మొదటి పార్ట్ సక్సెస్ కావడంతో... దానికి సీక్వెల్ తీసుకొచ్చారు. మ్యాడ్ స్క్వేర్ ( Mad Square ) పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమా పూర్తిగా కామెడీ యాంగిల్ లో నడుస్తుంది. ఇక హీరో నితిన్ అలాగే శ్రీ లీలా ( Sree Leela) నటించిన... రాబిన్ హుడ్ సినిమా లవ్ అలాగే యాక్షన్ మూవీ. అంటే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ లో రిలీజ్ అయ్యాయి. అందుకే రెండు సినిమాలకు కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.

రాబిన్ హుడ్ సినిమా అలాగే మ్యాడ్ 2 సినిమా క్లైమాక్స్ సీన్స్ ( Climax scenes) ఒకే దగ్గర.. తీసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఓ కోటలో.. రెండు సినిమాల క్లైమాక్స్ లు నడుస్తాయి. ఇప్పుడు ఆ కోటకు సంబంధించిన ఫోటోలనే... నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. రెండు సెట్స్ ఒకటే అని.. ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. దీంతో మొత్తానికి ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్లైమాక్స్ సీన్ సెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story