- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన త్రిష ఐడెంటిటీ.. ఏ భాషలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టోవినో థామస్ (Tovino Thomas), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఐడెంటిటీ’

దిశ, సినిమా: టోవినో థామస్ (Tovino Thomas), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఐడెంటిటీ’ (Identity). అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా వ్యవహరించారు. వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషించిన ‘ఐడెంటిటీ’ మూవీ రీసెంట్‌గా మలయాళం (Malayalam)లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు వారాలలో రూ. 50 కోట్లకు పైగా వసూలు రాబట్టి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది.
ఈ క్రమంలోనే మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ నెల 24 వ తేదీన తెలుగులో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ (Investigative action thriller) మూవీ ‘ఐడెంటిటీ’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ౫ (Zee5) సొంతం చేసుకోగా.. ఈ రోజు (జనవరి 31) నుంచే స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మలయాళంతో పాటు తెలుగు, తమిళం వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా అలీషా (త్రిష) వర్క్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ కేసు విషయమై పరిశోధిస్తున్న ఆమె ఓ హత్య కళ్లారా చూస్తుంది. దీంతో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అనుకోకుండా యాక్సిడెంట్‌కు గురవుతుంది. అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతోంది. ఓవరల్‌గా ఈ చిత్రం మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.






