- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
41 ఏళ్ల వయసులో బిగ్ బాంబ్ పేల్చిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (trisha) 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (trisha) 40 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), విదాముయార్చి వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాలో నటిస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే త్రిష దీంతో పాటు తమిళ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ‘థగ్‌లైఫ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో శింబు ఐశ్వర్య లక్ష్మి, రవి మోహన్ కీలక పాత్రలోకనిపించబోతున్నారు. అయితే రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జాయింట్ పిక్చర్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక త్రిష పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, త్రిష పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘‘నా పెళ్లి ఎప్పుడు అవుతుందో నాకే తెలియదు. కానీ నా మనసుకు నచ్చి వ్యక్తి దొరికితే కచ్చితంగా వివాహం చేసుకుంటాను. అయితే నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాతో కలిసి ఉంటాడనే నమ్మకం కలిగినప్పుడే చేసుకుంటా. విడాకులు తీసుకుని మధ్యలో విడిపోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని చాలా మంది అసంతృప్తిగా జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకు నమ్మకం లేదు. నాకు వివాహం అయినా ఒకే కాకపోయినా ఫర్వాలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






