Trisha: క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న త్రిష.. క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-03 10:32:04  IST  )

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Trisha: క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న త్రిష.. క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది. ఇక మలయాళంలో ‘ఐడెంటిటీ’(Identity) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో టోవినో థామస్(Tovino Thomas) హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని అఖిల్ పాల్, అనాస్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు. వినయ్ రాయ్(Vinay Roy) విలన్‌గా కనిపిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘ఐడెంటిటీ’ టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. మొదట అతన్ని ముఖాన్ని రఫ్‌గా గీద్దాం అని టోవినో త్రిషకు చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. అయితే ఇందులో మొత్తం త్రిష హంతకుడి గురించి మాట్లాడేది.. అతడిని కరెక్ట్‌గా గెస్ చేసేది చూపించి క్యూరియాసిటీని పెంచారు. అసలు ఆమె చూసిన క్రైమ్ ఏంటీ దానికి వినయ్ రాయ్‌కు సంబంధం ఏంటీ మధ్యలో టోవినో పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Video Link..

Next Story