సూపర్ ఆఫర్ వచ్చినా ఆ సినిమాలో నటించడానికి నో చెప్పిన త్రిష

by Pulgam srinivas |

రజనీ-కమల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో త్రిషకు హీరోయిన్ అవకాశం వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా రూ.12 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ, ఆమె ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

సూపర్ ఆఫర్ వచ్చినా ఆ సినిమాలో నటించడానికి నో చెప్పిన త్రిష
X

దిశ, వెబ్ డెస్క్: త్రిష ఇప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ బ్యూటీ తాజాగా ఓ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోలుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట. అంతేకాకుండా దాదాపు రూ.12 కోట్ల పారితోషకాన్ని కూడా ఆఫర్ చేశారట. అయితే ఇంత భారీ పారితోషకం ఆఫర్ చేసినప్పటికీ త్రిష సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.

దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ కారణంగానే త్రిష ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు ఇంగ్లీష్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇక త్రిష తాజాగా సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story