- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వంభర నుంచి తప్పుకున్న త్రిష.. ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేసిన టీమ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వంభర నుంచి బర్త్‌డే స్పెషల్‌గా త్రిష పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా: దక్షిణాది చిత్రపరిశ్రమలో దశాబ్దాలుగా తన గ్లామర్‌తో, నటనతో భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఎవర్ గ్రీన్ త్రిష ఈ రోజు తన 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నేడు తన పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అండ్ సెలబ్రిటీలు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాల నుంచి వరుస పోస్టర్‌లు రిలీజ్ చేశారు. ఇందులో భాంగంగా.. విశ్వంభర నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.
‘మా ‘అవని’కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అందమైన త్రిష మీరు రావడంతో ‘విశ్వంభర’ మరింత ప్రత్యేకంగా మారింది. విశ్వానికి మించిన మెగా మాస్ త్వరలో థియేటర్లలోకి రాబోతున్నది’ అని తెలిపారు. కాగా.. గత కొద్ది రోజులుగా త్రిష సినిమాలు ఇక చేయదు అని, విశ్వంభర నుంచి కూడా తప్పుకుందని వస్తున్న వార్తలతో ఈ పోస్టర్‌తో చెక్ పడినట్లు అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.






