- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trisha: ‘అతను ఎప్పటికీ నాకు ప్రత్యేకమే’.. ఎట్టకేలకు రిలేషన్ పై ఓపెన్ అయిన త్రిష
స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి వావ్ అనిపించుకుంది. అయితే సడెన్‌గా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 8 సినిమాలకు పైనే ఉన్నాయి. ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటుంది.
ఈ క్రమంలో త్రిష చాలా మందితో డేటింగ్‌లో ఉందని చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలా పుకార్లు వచ్చిన వారిలో హీరో విజయ్ దళపతి(Vijay Dalapathi) ఒకరు. త్రిష- విజయ్ జంటగా ‘లియో’(Leo) సినిమాలో నటించారు. అలాగే విజయ్ నటించిన ‘గోట్’(GOAT) మూవీలో త్రిష ఇప్పటివరకు ఎన్నడూ చేయని సాహసం చేసి అతని మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందని అందరూ అనుకున్నారు. అంతే కాదు వీరిద్దరు రీసెంట్‌గా కీర్తి సురేష్(Keerthy Suresh)- ఆంటోని తటిల్(Antony Thattil) పెళ్లికి వెళ్తున్న టైంలో ఎయిర్ పోర్ట్‌లో కెమెరాకి కూడా చిక్కారు.
దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. "నేను దళపతి విజయ్‌కి ప్రత్యేక అభిమానిని. ఆయన ఎప్పటికీ నాకు ప్రత్యేకమే. విజయ్ చాలా లవబుల్ పర్సన్, అతనితో వర్క్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అంటూ త్రిష.. విజయ్ పై ఉన్న ప్రేమను చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






