- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిప్తి డిమ్రి సరికొత్త అవతారం.. ఓటీటీ సినిమా ఫస్ట్ లుక్‌లో చపాతీ కర్రతో షాకిచ్చిన భామ!
ఈ కథ తల్లీ కూతుళ్ల బంధం చుట్టూ తిరగబోతోందని టాక్. అయితే ఇది సాధారణ కథ కాదు.

దిశ, సినిమా: బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ సినిమాలో జోయాగా నటించి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఇందులో రణ్‌బీర్ కపూర్ ప్రియురాలిగా బోల్డ్ లుక్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత గ్లామర్ పాత్రలు చేసినప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు త్రిప్తి.. బాలీవుడ్ గ్లామర్ క్వీన్‌తో కలిసి ‘మా బెహెన్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో ఆమె త్రిప్తి (జయా) తల్లిగా రేఖా పాత్రలో నటిస్తుండగా.. సురేష్ త్రివేణి తెరకెక్కిస్తున్నారు. గతంలో త్రిప్తి, బాలీవుడ్ ఎవర్ గ్రీన్ గ్లామర్ క్వీన్ మాధురి కాంబోలో వచ్చిన ‘భూల్ భూలయ్యా-3’ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సరికొత్త చిత్రం రాబోతుండటంతో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అయింది.
ఈ కథ తల్లీ కూతుళ్ల బంధం చుట్టూ తిరగబోతోందని టాక్. అయితే ఇది సాధారణ కథ కాదు. కుటుంబ సంబంధాలు, తరతరాల మధ్య వచ్చే విభేధాలు, వారసత్వం వల్ల ఫ్యామిలీలో తలెత్తే ఘర్షణలు, వాటిలో ఉండే ప్రేమను వినోదాత్మకంగా చూపించబోతున్నారట. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ త్రిప్తి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు గ్లామర్ డాల్‌లా కనిపించిన త్రిప్తి.. ఇందులో చపాతీ కర్ర చేతిలో పట్టుకుని నుదుటిన బొట్టు, చుడిదార్‌లో పక్కా మధ్యతరగతి గృహిణిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె లోని ఈ కొత్త యాంగిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఈచిత్రం థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ‘మా బెహెన్’ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జూన్ 4నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు కూడా త్రిప్తి ప్రకటించింది.






