Prabhas: ‘స్పిరిట్’ మూవీలో భాగమైనందుకు గౌరవంగా ఉందంటూ హాట్ బ్యూటీ పోస్ట్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-24 15:22:00  IST  )

బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ (animal) చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

Prabhas: ‘స్పిరిట్’ మూవీలో భాగమైనందుకు గౌరవంగా ఉందంటూ హాట్ బ్యూటీ పోస్ట్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ (animal) చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఒక్క సినిమాతోనే తన రేంజ్ మారిపోవడంతో అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక గత ఏడాది రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ బ్యాక్ టు బ్యాకు సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిప్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘స్పిరిట్’(Spirit) లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించింది.

ఇక ఈ పోస్ట్‌కు ‘‘నేను ఇంకా మునిగిపోతున్నాను. నన్ను నమ్మి ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందీప్ రెడ్డి వంగా దార్శనికతలో భాగమైనందుకు గౌరవంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ,మలయాళ, చైనీస్, జపనీస్, కొరియన్ ఏకంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. దీంతో అది చూసిన వారంతా ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్(Bhadrakali Pictures) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన పలు వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా,రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు పలు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే త్రిప్తి అధికారిక ప్రకటన విడుదల చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు ఆమె డార్లింగ్ సరసన సెట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ మూవీతో అమ్మడు రేంజ్ మారిపోతుందని అంటున్నారు.

Next Story