- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు భాషల్లో ‘త్రిముఖ’
యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘త్రిముఖ’. అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

దిశ, సినిమా : యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘త్రిముఖ’. అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ పాన్ ఇండియా మూవీని ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన డైరెక్టర్ రాజేశ్ నాయుడు.. ‘ఒక మంచి కథతో, బలమైన స్క్రీన్ ప్లేతో ‘త్రిముఖ’ చిత్రాన్ని రూపొందించాను. మూవీ ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైన్ చేస్తుంది. సెకండాఫ్ తల పక్కకు తిప్పనంతగా ఎంగేజింగ్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి పాత్ర ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. రొటీన్ సినిమాలకు తప్పకుండా భిన్నంగా ఉండేలా ప్రయత్నించాం. యోగేష్‌కు నటుడిగా పేరు తెచ్చే మూవీ అవుతుంది’ అని తెలిపాడు.






