- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారణాసి ఈవెంట్‌లో అందెశ్రీకి నివాళి
రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమా టైటిల్‌ను నేడు అనౌన్స్ చేశారు. రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి వారణాసి అనే టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను సైతం విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాజమౌళి మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ29 సినిమా టైటిల్‌ను నేడు అనౌన్స్ చేశారు. రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి వారణాసి అనే టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను సైతం విడుదల చేశారు. ఇక ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఇటీవల మరణించిన తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీకి నివాళి అర్పించారు.
ఈవెంట్ లో గ్లింప్స్ కోసం ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ పై అందెశ్రీ ఫోటోలను వేస్తూ బ్యాగ్రౌండ్ లో జయజయహే తెలంగాణ గీతాన్ని పాడారు. ఈ క్రమంలో రాజమౌళి, మహేశ్ బాబు సహా హాజరైన నటీనటులు, ఇతరులు నిలబడి అందెశ్రీకి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే జయజయహే గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చారు. అంతే కాకుండా వారణాసి సినిమాకు సైతం ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రగీతం కోసం సైతం అందెశ్రీ కీరవాణి కలిసి పనిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.






