Kaalamega Karingindi: కాలమేగా కరిగింది ట్రైలర్.. కలహాలే లేని ఓ ప్రేమ కథ విన్నారా?

by Chukka Sudharani |   (  Updated:2025-07-31 08:47:01  IST  )

వినయ్ కుమార్ (Vinay Kumar), శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ పొయోటిక్ లవ్ స్టోరి ‘కాలమేగా కరిగింది’

Kaalamega Karingindi: కాలమేగా కరిగింది ట్రైలర్.. కలహాలే లేని ఓ ప్రేమ కథ విన్నారా?
X

దిశ, సినిమా: వినయ్ కుమార్ (Vinay Kumar), శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ పొయోటిక్ లవ్ స్టోరి ‘కాలమేగా కరిగింది’ (Kaalamega Karingindi). సింగార క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మరే శివశంకర్ నిర్మాణంలో సింగార మోహన్ (Singara Mohan) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషనల్ కంటెంట్‌(Promotional content)తో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మేరకు మూవీ నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇటీవల ‘తను జతగా..’ పాటను విడుదల చెయ్యగా.. తాజాగా ట్రైలర్ (Trailer) రిలీజ్ చేశారు. ‘నువ్వు దూరం అయ్యాక.. మన ప్రయాణాన్ని ఒక కావ్యంగా రాయాలి అనిపించింది. అది చదువుతున్నప్పుడు నా పెదవి చప్పుడు వినాల్సింది అసలు దూరం అయ్యేవాడివి కాదు’ అని ఓ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఓ టీనేజ్ జంట లవ్ స్టోరీని అందంగా ప్రజెంట్ చేస్తోంది. ‘జీవితంలో మొట్ట మొదటిసారి ఎందుకో మదిలో తెలియని ఈ అలజడి.. మరువలేక నేనా.. ఈ మధుర పాఠం’ అంటూ మధ్య మధ్యలో వచ్చే కొన్ని వ్యాఖ్యలు సినిమాపై గుడ్ ఇంపాక్ట్‌ (Good impact)ను క్రియేట్ చేస్తున్నారు.

Next Story