- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక వ్యక్తే.. నోబడీ నుంచి ట్రైలర్ రిలీజ్
ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు.

దిశ, సినిమా: ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. పృథ్వీరాజ్ హీరోగా, టాలెంటెడ్ నటి పార్వతీ తిరువోతు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఐ, నోబడీ’. ప్రయోగాత్మక దర్శకుడు నిసామ్ బషీర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక వ్యక్తే!!’ అంటూ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌లో పోరాట సన్నివేశాలు చాలా పదునుగా, మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి ధైర్యంతో, ఒక లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదిగే కథలా ఇది అనిపిస్తోంది. తెరపై ఈ 'సాధారణ వ్యక్తి' (nobody) ఎలా 'అసాధారణ వ్యక్తి'గా (somebody) మారుతాడో ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలో ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్నది.






