Drinker Sai:‘డ్రింకర్ సాయి’ నుంచి ట్రైలర్ విడుదల..!

by Kodari Anjali |

కిరణ్ తిరుమలశెట్టి(Kiran Tirumalashetty) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డ్రింకర్ సాయి’(Drinker Sai).

Drinker Sai:‘డ్రింకర్ సాయి’ నుంచి ట్రైలర్ విడుదల..!
X

దిశ, వెబ్‌డెస్క్: కిరణ్ తిరుమలశెట్టి(Kiran Tirumalashetty) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డ్రింకర్ సాయి’(Drinker Sai). బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్(Brand of bad boys) అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా ఎవరెస్ట్ సినిమాస్(Everest Cinemas), స్మార్ట్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్(Smart Screen Entertainments Banners) పై రూపొందుతుంది. అలాగే ఈ మూవీని ఇస్మాయిల్ షేక్(Ismail Sheikh), బసవరాజు శ్రీనివాస్(Basavaraja Srinivas), బసవరాజు లహరిధర్(Basavaraja Laharidhar) నిర్మాణిస్తున్నారు. ధర్మ(dharma), ఐశ్వర్య శర్మ హీరో(Aishwarya Sharma), హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ నెల (డిసెంబరు)27 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనున్న ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Iyengar), పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali), ఎస్ఎస్ కాంచి,(SS Kanchi) సమీర్(Sameer), రీతు చౌదరి(Ritu Choudhary), భద్రం(Bhadraṁ), కిర్రాక్ సీత(Kirrak Sita), ఫన్ బకెట్ రాజేష్(Fun bucket Rajesh)..తదితరులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే తాజాగా డ్రింకర్ సాయి’ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ప్రేమ కథకు సంబంధించిన స్తోరీ అని తెలుస్తోంది. లవ్ చేసిన అమ్మాయి కోసం పడే తపన ఎలా ఉంటుంది..? అమ్మాయి దూరం పెడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ విడుదలై.. ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Next Story