- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy: బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు దుర్మరణం
బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ (Aman Jaiswal) (23) రోడ్డు ప్రమాదం (Road Accident)లో దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం అర్ధరాత్రి ఆయన బైక్‌పై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ భారీ ట్రక్కు ఆయన బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అమన్ జైస్వాల్ (Aman Jaiswal)కు తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అమన్ చికిత్స పొందుతూ.. ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా, చిన్న వయసులోనే నటనలో మంచి భవిష్యత్తు ఉన్న అమన్ అకాల మరణానికి గురి కావడం పట్ల తోటి నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అమన్ ‘ధర్తీపుత్ర నందిని’ అనే సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించారు.






