- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (94) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. శివశక్తి దత్తా కూడా ఇండస్ట్రీకి చెందినవారే. ఆయన పలు తెలుగు సినిమాలకు గీతాలు రచించారు. అంతేకాదు, ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు శివశక్తి స్వయంగా సోదరుడు అవుతాడు.
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబరు 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. చిన్న తనంలోనే కళలపై ఉన్న ఆసక్తితో గిటార్, సితార, హార్మోనియం నేర్చుకున్నారు. అనంతరం మద్రాసు వెళ్లిపోయి సోదరుడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినీరంగంలోకి వచ్చారు. 1988లో వచ్చిన జానకి రాముడు సినిమాతో వీరికి మంచి పేరొచ్చింది. ఈ సినిమాకు శివశక్తి దత్తా స్క్రీన్‌రైటర్‌గా పనిచేశారు. బాహుబలి 1 (మమతల తల్లి, ధీవర), బాహుబలి 2 (సాహోరే బాహుబలి), ఎన్టీఆర్: కథానాయకుడు (కథానాయక), ఆర్‌ఆర్‌ఆర్ (రామం రాఘవమ్), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), సై (నల్లా నల్లని కళ్ల పిల్ల), ఛత్రపతి (మన్నేల తింటివిరా), రాజన్న (అమ్మా అవని) తదితర సినిమాల్లో కొన్ని పాటలకు లిరిక్స్ రాశారు.
కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పాటను కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్తా నాటు నాటు పాట తనకు అంతగా నచ్చలేదని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అది కూడా పాటేనా? అందులో సంగీతం ఎక్కడుంది? చంద్రబోస్ రాసి 5 వేల పాటలకంటే ఇది ఏ మాత్రం మెరుగైన సాంగ్ కాదు. కీరవాణి కెరీర్‌లో ఇది అత్యుత్తమ మ్యూజిక్ కాదు' అని శివ శక్తి దత్త ఓ ఇంటర్వూలో తెలిపారు.






