ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

by Naga Rani Yarlagadda |

ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ అకస్మాత్తు మరణం ఆయన కుటుంబ సభ్యులను, సన్నిహితులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అన్నమయ్య జిల్లా కలికిరి మండల కేంద్రంలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు రాజేంద్ర శనివారం అక్కడికి చేరుకున్నారు. రాత్రి తన స్నేహితుడి ఇంట్లోనే బస చేసిన ఆయన, ఆదివారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు తక్షణమే స్పందించి ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ..

ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న సమయంలోనే రాజేంద్ర పరిస్థితి విషమించింది. వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న చంద్రబోస్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజేంద్ర మృతి పట్ల సినీ ప్రముఖులు, చంద్రబోస్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story