Tragedy: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత హఠాన్మరణం

by Kema Shiva Kumar |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Tragedy: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత హఠాన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (Vedaraju Timber) (54) కన్నుమూశారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన అనారోగ్యంతో హైదరాబాద్‌ (Hyderabad)లోని ఏఐజీ హాస్పిటల్‌ (AIG Hospital)లో ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సినిమాలపై ఇష్టంతో ఓ వైపు కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించిన నిర్మాత వేదరాజు టింబర్ (Vedaraju Timber) త్వరలో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.

నిర్మాత వేదరాజు టింబర్ టాలీవుడ్ హీరో అల్లరి నరేష్‌ (Allari Naresh)తో ‘మడత కాజా’ (Madatha Kaaja), ‘సంఘర్షణ’ (Sangharshana) వంటి చిత్రాలను నిర్మించారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యంతో హైదరాబాద్‌ (Hyderabad)లోని ఏఐజీ హాస్పిటల్‌ (AIG Hospital)లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే కోలుకుని వస్తారని సన్నిహితులు, కుటుంబ సభ్యులు భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. వేదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్లుగా బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాత వేదరాజు టింబర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం ప్రకటించారు.

కాగా, ఈ మధ్య సినీ ప్రముఖుల ఆకస్మిక మరణాలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొంతమంది వ్యక్తిగత కారణాలు, ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరి కొంతమంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం దురదృష్టకరం.

Next Story