- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Toxic: తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ ఇవే
టాక్సిక్ తమిళనాడు హక్కులను పింక్ స్టూడియోస్, ఎస్ పిక్చర్స్, వైట్ నైట్స్, ట్రిడెంట్ ఆర్ట్స్, కె. సెందిల్ రిలీజ్ సంస్థలు దక్కించుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : కన్నడ స్టార్ హీరో యాష్ ప్రస్తుతం టాక్సిక్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోగా నటిస్తున్నాడు. దీనిని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సేల్ చేశారు. వాటిని దిల్ రాజు ఏకంగా 120 కోట్లకు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తమిళనాడు ఏరియా మొత్తం హక్కులు సేల్ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ సంస్థ ఈ సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకుంది అనేది ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.
చెన్నై సిటీ యొక్క హక్కులను పింక్ స్టూడియోస్ దక్కించుకున్నట్లు, నార్త్ అండ్ సౌత్ ఆర్కాట్, కోయంబత్తూర్, తిరునివేలి, కన్యాకుమారి ప్రాంతాల హక్కులను ఎస్ పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. చంగల్పేట హక్కులను వైట్ నైట్స్, ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థలు దక్కించుకున్నాయి. మధురై, రామ్నాథ్, ట్రిచేయ్, తంజావూరు, సేలం హక్కులను కే సెందిల్ రిలీజ్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాలను ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి లేడీ డైరెక్టర్ అయిన గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ, నయనతార, తార సుతరియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ఇందులో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.






