యశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో వంద రోజులే..

by Sujitha Rachapalli |

స్టార్ హీరో యశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19, 2026న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కానుండగా.. కేవలం 100 రోజులు మాత్రమే ఉందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వ‌చ్చే ఏడాది అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి

యశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరో వంద రోజులే..
X

దిశ, సినిమా : స్టార్ హీరో యశ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. మార్చి 19, 2026న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కానుండగా.. కేవలం 100 రోజులు మాత్రమే ఉందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. వ‌చ్చే ఏడాది అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వెయిట్ చేస్తోన్న సినిమాల్లో ఇదొక‌టి. కాగా ఇప్ప‌టికే వచ్చిన అప్‌డేట్స్‌‌తో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లేలా ప‌వ‌ర్ఫుల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్న యశ్.. మెలి తిరిగిన కండ‌ల‌తో, ర‌క్తంతో నిండిన బాత్ ట‌బ్‌లో కూర్చుని ఉన్నాడు. శ‌రీరంపై ఉన్న టాటూస్ చూస్తుంటే త‌న‌లోని బ్యాడ్ యాష్ వైబ్‌ను, క్యారెక్ట‌ర్‌ను పోస్ట‌ర్‌తో ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింది మూవీ టీమ్. మొత్తానికి గుడి ప‌డ్వ, ఉగాది, ఈద్ క‌లిసిన వారాంతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఛాన్స్‌ను క్రియేట్ చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ వ‌ర్క్‌ను ఉజ్వల్ కులకర్ణి .. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను టీపీ ఆబిద్ నిర్వహిస్తున్నారు. జాన్ విక్ వంటి చిత్రాల‌కు ప‌ని చేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ, జాతీయ అవార్డు గ్రహీత అన్బరివ్ కలిసి ఈ చిత్రంలోని కీలక యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

Next Story