మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఒకే రోజు రెండు అప్డేట్స్‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-12 17:52:56  IST  )

శనివారం రోజున ఇద్దరు మెగా హీరోల సినిమాల నుంచి అప్డేట్లు రానున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌..ఒకే రోజు రెండు అప్డేట్స్‌
X

దిశ, వెబ్ డెస్క్‌: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. శనివారం రోజున ఇద్దరు మెగా హీరోల సినిమాల నుంచి అప్డేట్లు రానున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి అప్డేట్లు రానున్నాయి. రేపు సాయంత్రం ఐదు గంటల సమయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రెస్ మీట్ ఉంటుందట.

ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్‌గారు సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవితో పాటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి పాల్గొంటార‌ని స‌మాచారం. ఇక అటు ఈ ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత సరిగ్గా సాయంత్రం 6:30 గంట‌లకు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఇలా ఒకే రోజు రెండు సినిమాల అప్డేట్ వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Next Story