- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. అల్లరి నరేష్ నిర్మాత మృతి!
టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరణించారు. తెలుగులో పలు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మరణించారు. తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న ముళ్ళపూడి బ్రహ్మానందం ( Mullapudi Brahmanandam ) మృతి చెందారు. 68 సంవత్సరాలు ఉన్న టాలీవుడ్ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం... తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు రాత్రి 10 గంటల సమయంలో... నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా దాదాపు వారం రోజుల నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. అయితే నిన్న రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో... వైద్యులకు కూడా ఏం చేయలేకపోయారట.
పరిస్థితి దాటిపోవడంతో ఆయన.. మరణించారని చెబుతున్నారు. దీంతో ముళ్ళపూడి బ్రహ్మానందం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు.. ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మరి కొంతమంది ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో (Australia) ఉంటున్నాడని తెలుస్తోంది. తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ముళ్ళపూడి బ్రహ్మానందం కు భార్య మంగాయమ్మ, కొడుకు సతీష్ అలాగే కూతురు మాధవి ఉన్నారు. ఇవివి సత్యనారాయణకు ( E. V. V. Satyanarayana ) సొంత బావమరిది వరుస అవుతారు ముళ్ళపూడి బ్రహ్మానందం. ఇవివి సత్యనారాయణ చెల్లెలను మూలపూడి బ్రహ్మానందం పెళ్లి చేసుకున్నారు. కాగా అల్లరి నరేష్ తో ( Allari Naresh) ముళ్లపూడి బ్రహ్మానందం నేను సినిమా చేసిన సంగతి తెలిసిందే.






