గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ బ్యూటీ.. అమర జవాన్ కుటుంబానికి సాయం.. స్టార్స్ చేయలేని పని చేశావంటూ ప్రశంసలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-23 10:38:08  IST  )

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ బ్యూటీ.. అమర జవాన్ కుటుంబానికి సాయం.. స్టార్స్ చేయలేని పని చేశావంటూ ప్రశంసలు
X

దిశ, సినిమా: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ పాక్‌పై అనుమానంతో ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ వారికి చుక్కలు చూపించారు భారత్ సైనికులు. ఇక ఇందులో భాగంగా మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కళ్లి తాండ గ్రామానికి చెందిన ఆయన పాక్ సైనికులు జరిపిన కాల్పు్లో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ సంఘటన యావత్ భారత్‌ను కన్నీరు పెట్టుకునేలా చేసింది. అయితే ఈ విషాదం నుంచి మురళీ నాయక్ కుటుంబం ఇప్పటికీ తేరుకోలేకపోతుంది. ఈక్రమంలోనే వారిని రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు వెళ్లి కలుస్తూ ధైర్యం చెబుతున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మిత్రా శర్మ(Mitra Sharma) తనవంతుగా ఆర్థిక సాయం చేసింది.

స్వయంగా కళ్లి తాండకు వెళ్లి మురళీ నాయక్ తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పింది. అంతేకాకుండా అతని సమాధి వద్ద నివాళులు అర్పించింది. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. దీనికి ‘‘మనం గొప్ప వీరుడిని కోల్పోయాం’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా స్టార్ హీరోలు చేయని పని నువ్వు చేసావ్ గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, మిత్రా శర్మ విషయానికొస్తే.. ఈ అమ్మడు బిగ్‌బాస్ షోలో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మిత్రా శర్మ ‘వర్జిన్ బాయ్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీహాన్ హీరోగా నటించిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Next Story