హల్దీ ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరో.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్(Suhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

హల్దీ ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ క్రేజీ హీరో.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరో సుహాస్(Suhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించాడు. దీంతో సినిమాల్లో నటించే చాన్స్ వచ్చింది. అలా ‘పడి పడి లేచే మనసు’(Padi Padi Leche Manasu), ‘మజిలీ’(Majili), ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’(Agent Sai Srinivasa Athreya), ‘డియర్ కామ్రెడ్’(Dear Camrade) వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అలరించాడు. ఆ తర్వాత ‘కలర్ ఫోటో’(Colour Photo) అనే మూవీతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

అలా ఓ పక్క హీరోగా మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఓ భామ అయ్యో రామ’(OBama Ayyo Rama), ‘ఆనందరావు అడ్వెంచర్స్’(Anandrao Adventure), ‘కేబుల్ రెడ్డి’(Cable Reddy), ‘ఉప్పు కప్పు రంబు’(Uppu Kappu Rambu), ‘మండాడి’(Mandadi) వంటి సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో సుహాస్ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఇన్‌స్టా(Instagram)లో కొన్ని పిక్స్ షేర్ చేశాడు. ఎల్లో కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలీష్ స్టిల్స్‌లో ఫొటోస్ దిగాడు. ఇక వాటికి ‘హల్దీ’(Haldi) అనే క్యాప్షన్ కూడా జోడించాడు. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story