సినిమా హిట్ కావాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-31 10:39:31  IST  )

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) .

సినిమా హిట్ కావాలని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen), రామ్ నారాయణ్(Ram Narayan) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’(Laila) . ఈ సినిమాను షైన్ స్క్రీన్ పిక్చర్స్(Shine Screen Pictures), ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్(SMT Archana Presents) బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ఆకాంక్ష శర్మ(Akanksha Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్‌డే సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్‌, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఫస్ట్ టైం లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొన్నది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ యంగ్ హీరో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ మూవీ హిట్ కావాలని తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను విశ్వక్ సేన్‌కు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘ స్వామి వారి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలి. అలాగే మా సినిమా లైలా ట్రైలర్ ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ మూవీలో లేడీ గెటప్‌లో కనిపిస్తాను. కుటుంబంతో కలిసి అందరూ చూసే కామెడీ చిత్రం లైలా. మీ అందరికి నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు.

కాగా విశ్వక్ సేన్ ‘వెళ్లి పోమాకే’(Vellipomake) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’(Ee nagaraniki emaindhi), ‘ఫలక్‌నుమాదాస్’(Falaknuma Das), ‘హిట్’(HIT), ‘పాగల్’(Pagal), ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’(Ashokavanam Lo Arjuna Kalyanam), ‘ఓరి దేవుడా’(Ori Devuda), ‘ముఖ చిత్రం’(Mukha Chithram), ‘హిట్-2’(Hit-2), ‘దాస్ కా ధమ్కీ’(Das Ka Dhamki), ‘బూ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari), ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం లైలా మూవీతో పాటు ఫంకీ(Funkey) సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Next Story