Ram Charan: ‘పెద్ది’ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం!

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi).

Ram Charan: ‘పెద్ది’ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఇక ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’(peddi). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో వెంకట సతీష్ కిలరు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాను ఊహించని రేంజ్‌లోకి తీసుకెళ్లింది. దీంతో ‘పెద్ది’ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా వేచి చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

అందరిలో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా, ‘పెద్ది’లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు పలు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ఆ చిత్రంలో గ్లోబల్ స్టార్ సరసన చిందులేయబోతున్నట్లు టాక్. అయితే సినిమా మొత్తానికే ఈ పాట హైలెట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా స్క్రీన్స్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయమని అంటున్నారు.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో వీరిద్దరి కాంబోలో సాంగ్ వస్తుందంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించలేమని అభిప్రాయపడుతున్నారు. కాజల్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు ఇటీవల ‘సికందర్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’లో కీలక పాత్రలో నటించబోతుంది. అయితే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story