‘మరింత రిచ్ అనుభూతిని కలిగిస్తుంది’.. నెట్టింట సెన్సేషనల్‌గా సమంత పోస్ట్

by Kodari Anjali |

హీరోయిన్ నుంచి నిర్మాతగా మారి తనలోని కొత్త టాలెంట్‌ను నిరూపించుకుంటోంది టాలీవుడ్ అగ్ర తార సమంత.

‘మరింత రిచ్ అనుభూతిని కలిగిస్తుంది’.. నెట్టింట సెన్సేషనల్‌గా సమంత పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నుంచి నిర్మాతగా మారి తనలోని కొత్త టాలెంట్‌ను నిరూపించుకుంటోంది టాలీవుడ్ అగ్ర తార సమంత. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.. యూత్ ఆల్టైమ్ ఫేవరెట్ నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏ ముహూర్తాన తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. కెరీర్ స్టార్టింగ్లోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అనేక చిత్రాల్లో అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత మళ్లీ ఫామ్లోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ.. తనదైన టాలెంట్తో ప్రేక్షకుల్ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

రీసెంట్గానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శుభం సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సమంత నిర్మాతగా వ్యవహరించింది. తొలి నిర్మాతగా సామ్కు ఇదే మొదటి చిత్రం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో సమంత ముఖంలో సంతోషం కనిపించింది. దీంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వరుస పోస్టులతో ఈ నటిని ముంచెత్తారు. ఇక నెటిజన్లలో సమంత క్రేజ్ ఎప్పటికీ తగ్గదని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఇకపోతే సామ్ తాజాగా నెట్టింట పర్ఫ్మూమ్ గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ‘శుభ్రమైన పెర్ఫ్యూమ్‌ల కోసం మేము మా ప్యాకేజింగ్‌ను ఇలా రూపొందించాం. ఎక్కువసేపు నిలిచి ఉండే, మరింత ధనికమైన అనుభూతిని కలిగించే.. మీ మానసిక స్థితిని మెరుగుపరిచే సువాసన కోసం అధిక ముఖ్యమైన నూనె సాంద్రతతో రూపొందిస్తుంది. 100 మి.లీ. బాటిల్ మీకు 800 కంటే ఎక్కువ మూడ్-లిఫ్టింగ్ స్ప్రిట్జ్‌లను అందిస్తుంది. ఇది చాలా కాలం పాటు ఉండేలా తయారుచేయడం జరిగింది. secret.alchemist శుభ్రంగా నిజాయితీగా ఉండటం పట్ల మన నమ్మకాన్ని దాచడానికి సుగంధ ద్రవ్యాలకు మించి ఏమీ లేదు’. అంటూ సామ్ రాసుకొచ్చింది.

Next Story