- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ మూవీ.. స్పెషల్ తెలిస్తే వావ్ అనాల్సిందే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’ (Nenu Local)సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస విజయాలు సాధిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) వంటి సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టడమే కాకుండా పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్(Bollywood) ఆఫర్ కూడా తలుపు తడుతున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) సరసన ‘బేబీ జాన్’ (Baby John)సినిమాలో నటించింది.
ఈ మూవీ తమిళంలో వచ్చిన ‘తేరీ’(Thery) చిత్రానికి రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తేరీలో విజయ్ దళపతి(Vijay Dalapathi) అండ్ సమంత(samantha) జంటగా నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇక బేబీ జాన్ కూడా అదే రేంజ్‌లో హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బేబీ జాన్ ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటివరకు రెంట్ పద్ధతితో ఉండగా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime) లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. కాగా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి తమన్ (Thaman) సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఓటీటీ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటివరకు థియేటర్లో ఈ సినిమా చూడని వారు అమెజాన్ ప్రైమ్లో చూసేయండి.






