- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చ్ అంటూ అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇటు చూడండి బాసు అని నెటిజన్ల కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అష్టాచెమ్మా’(Asta chemma) సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఆయన తన ఫస్ట్ చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అష్టాచెమ్మా’(Asta chemma) సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఆయన తన ఫస్ట్ చిత్రం తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస మూవీలు చేస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ‘దసరా’(Dasara) వంటి సినిమాలకైతే ఏకంగా అవార్డులు కూడా వరించాయి. ప్రస్తుతం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా మారి సినిమాలు కూడా తీస్తున్నాడు. అలా చేస్తున్న వాటిలో ‘హిట్-3’(Hit-3), చిరంజీవి(Chiranjeevi)తో ఓ చిత్రం చేస్తున్నాడు.
అయితే హిట్-3 మూవీలో హీరోగా కూడా నానినే నటిస్తున్నాడు. అలాగే ‘ది ప్యారడైజ్’(The Paradise) చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈక్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నాని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేశారు.
అందులో టీషర్ట్ వేసుకుని అదిరిపోయే లుక్‌లో ఫొటోస్ షేర్ చేశాడు. ఇక వాటికి ‘మార్చ్’(March) అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన గర్ల్ ఫ్యాన్స్ అటు ఎటో చూస్తే ఎలా బాసు ఇటు చూడు కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మన నేచురల్ స్టార్ నాని పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.






