Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్టుగా టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?

by Phanindra |

త్వరలోనే మొదలవ్వనున్న బిగ్ బాస్ సీజన్ 9 ( Bigg Boss Season 9 ) గత సీజన్స్ కంటే కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్టుగా టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ ( Bigg boss ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియాలిటీ ( Reality show ) షో ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో పాపులర్ అయింది. బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు మన తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు 9వ సీజన్ కి ముస్తాబవుతోంది. అయితే, దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

త్వరలోనే మొదలవ్వనున్న బిగ్ బాస్ సీజన్ 9 ( Bigg Boss Season 9 ) గత సీజన్స్ కంటే కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే, మేకర్స్ కంటెస్టెంట్ల ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసిన సమాచారం. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ కి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

సీజన్ 1 ఎన్టీఆర్ ( NTR) హోస్ట్ చేయగా, సీజన్ 2 హీరో నాని (NANI ) హోస్ట్ చేయగా.. 3 వ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున (Nagarjuna ) హోస్ట్ గా చేస్తున్న విషయం మనకీ తెలిసిందే. అయితే, సీజన్ 9 హోస్టుగా టాలీవుడ్ నుంచి యంగ్ హీరో రాబోతున్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు .. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay devarakonda ) బిగ్ బాస్ 9 కి హోస్టుగా వ్యవహరించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే , దీనికి సంబంధించి బిగ్ బాస్ నుంచి ఎలాంటి అధికారిక అనౌన్స్ రాలేదు. అయినప్పటికీ, ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

Next Story