హ్యాండ్‌సమ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ లేడీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్

by I. Sairam |

నేచురల్ స్టార్ నాని(Nani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ప్రజెంట్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

హ్యాండ్‌సమ్ లుక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ లేడీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Nani) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా వచ్చి ప్రజెంట్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. మరోపక్క నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా కోర్ట్(Court), హిట్-3(Hit-3) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని ప్రజెంట్ ‘ది ప్యారడైజ్’(The Paradise) మూవీతో బిజీగా ఉన్నాడు. ఇక దీనికి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తుండగా.. వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నాని సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో కూడా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నాని తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని హ్యాండ్ సమ్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. గుబురు గడ్డ, లాంగ్ హెయిర్, గాగూల్స్‌తో స్టైలీష్‌గా కనిపించాడు. ఇక వీటికి ‘జూలై’ అంటూ రాసుకొస్తూ వైట్ హార్ట్ సింబల్ జోడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. లేడీ ఫ్యాన్ గర్ల్స్ అబ్బా ఏమున్నాడ్రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story