- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ చరణ్ ‘RC-16’ సినిమాలో కామియో రోల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో.. హైప్ పెంచుతున్న ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇందులో జగపతి బాబు(Jagapathi Babu), దివ్వేంద్, శివరాజ్ కుమార్(Shivaraj Kumar) కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘RC16’ షూటింగ్ స్టార్ట్ కాగా.. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘RC16’ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయనున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని మూవీ మేకర్స్ కామియో రోల్ చేయమని సంప్రదించగా.. దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కన్ఫర్మ్ అయితే మాత్రం సూపర్ ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Director #BuchiBabu is considering casting Megastar #Chiranjeevi in #RC16 for a small cameo. 💥💥💥💥🤩🤩🚀
— Filmy Bowl (@FilmyBowl) February 28, 2025
Discussions are currently underway, and an official announcement will be made soon. https://t.co/2q5ACcp9DC






