- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రేపు చూసుకుందాం’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ షాకింగ్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా(Ustaad Bhagat Singh Movie) మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో వేగం పెంచింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'దేఖ్లేంగే సాలా' పాట బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తాజాగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే సెకండ్ సాంగ్ ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన పూర్తి పాటను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా దర్శకుడు హరీశ్ శంకర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘రేసు చూసుకుందాం.. ఐ మీన్.. రేపు కలుసుకుందాం..’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. మరోవైపు.. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమిళ అగ్ర కథానాయకుడు పార్థిబన్ కీలక పాత్ర పోషించారు. కేఎస్ రవికుమార్, ఎల్బీ శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాష్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






