పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక.. రెడ్ హ్యాండెడ్‌గా కారులో అతడితో దొరకడంతో కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ రూమర్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక.. రెడ్ హ్యాండెడ్‌గా కారులో అతడితో దొరకడంతో కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రూమర్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'గీత గోవిందం'(Geetha Govindam), 'డియర్ కామ్రేడ్'(Dear Comrade) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ కలిసే ఉంటున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. అంతేకాదండోయ్ ఎన్నో సార్లు మీడియాకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీరి రిలేషన్ గురించి ఇప్పటివరకు అఫీషయల్‌గా ప్రకటించలేదు. ఈ క్రమంలో విజయ్, రష్మిక మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ వీడియోతో దాదాపు అది నిజమే అని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

తాజాగా ముంబై విమానాశ్రయం(Mumbai Airport)లో ఈ జంట కలిసి కనిపించడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ ముందు సీటులో కూర్చుని కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫొటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది. ఇక వీరి ఫ్యాన్స్ మాత్రం త్వరగా పెళ్లి చేసుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story