- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన ఏడాదికే భర్తతో విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ సింగర్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
బుల్లితెరపై వచ్చే షోల్లో పాడుతా తీయగా సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ఎంతోమంది సింగర్స్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

దిశ, సినిమా: బుల్లితెరపై వచ్చే షోల్లో పాడుతా తీయగా సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ఎంతోమంది సింగర్స్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా వచ్చి స్టార్ హీరోల చిత్రాల్లో పాటలు పాడి సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే పాడుతా తీయగా ద్వారా వచ్చి వారిలో సింగర్ హారిక నారాయణ్(Harika Narayan) కూడా ఒకరు. ఆమె తనదైన శైలిలో పాటలు పాడుతూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలా వారసుడు, సర్కారి వారి పాట వంటి చిత్రాల్లో పాడి తన గొంతుతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలాగే పలు షోస్‌లోనూ పాడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక గత ఏడాది హారిక పృథ్వీనాధ్(Prithvinad) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఇక వీరి పెళ్లి యాంకర్ ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju)తో సహా కీరవాణి(Keeravani,), రాఘవేంద్రరావు(Raghavendra Rao) వంటి వారు ఎంతో మంది వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి కాపురం కొన్నాళ్ల పాటు బాగానే సాగింది. ఇక హారిక పాటలు పాడటంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, హారిక నారాయణ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. పెళ్లైన ఏడాదికే ఆమె ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలతో పాటు భర్తతో కలిసి తీసుకున్న పిక్స్ డిలీట్ చేయడంతో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నో పోస్టులు పెట్టిన ఆమె కేవలం భర్త ఫొటోలనే తొలగించడంతో చర్చానీయాంశంగా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా హారిక సైలెంట్‌గా తన భర్తతో విడాకులు తీసుకుంది కావచ్చు అందుకే డిలీట్ చేసిందని చర్చించుకుంటున్నారు. అయితే ఆమె భర్త పేజీలోనూ పెళ్లి ఫొటోలు లేకపోవడంతో విడాకుల వార్తలు జోరందుకున్నాయి. ఇక హీరో, హీరోయిన్లు విడాకులు తీసుకునే ముందు ఇలా సోషల్ మీడియాలో ఫొటోలు డిలీట్ చేయడం కామన్. ఇక వారిని ఫాలో అవుతూ వీరిద్దరు అలా చేశారని అంతా అనుకుంటున్నారు. ఇక హారిక విడాకులపై క్లారిటీ రావాలంటే వీరిద్దరు స్పందిస్తూ కానీ వార్తలకు చెక్ పడేట్లు లేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






