- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tollywood : రిపీట్ అవుతున్న జోడీలు.. ఏకంగా మూడు సార్లు
Tollywood : ప్రస్తుతం అనేక జోడీలు తెలుగులో రిపీట్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా పరిశ్రమలో జోడీలు రిపీట్ అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఒక హీరో, హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించినప్పుడు, అది మంచి విజయం సాధించినా లేదా అందులో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు దక్కినా, ఆ తర్వాత చాలామంది దర్శకులు, నిర్మాతలు వారిద్దరితో సినిమా చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం అప్పటికే వారి జంటకు మంచి గుర్తింపు రావడంతో సినిమా సులువుగా జనాల్లోకి వెళుతుందని వారు భావించడమే. ప్రస్తుతం కూడా ఇలా రిపీట్ అవుతున్న జోడీలతో కొన్ని సినిమాలు తెలుగులో రూపొందుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
చిరంజీవి - త్రిష
తమిళ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. 2006లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ జోడీ మళ్ళీ కలిసి నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండ - రష్మిక
వీరిద్దరూ కలిసి మొదట గీత గోవిందంలో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'లో వీరిద్దరూ నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించకపోయినా ఈ జంటకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ రణబాలి అనే చిత్రంలో నటిస్తున్నారు.
నాగార్జున - టబు
ఈ ఇద్దరూ జోడీగా మొదట నిన్నే పెళ్లాడుతా అనే చిత్రంలో నటించారు. ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఒక క్లాసిక్ అయింది. ఆ తర్వాత 'ఆవిడ మా ఆవిడే'లో వీరిద్దరూ నటించారు. ఇక సిసింద్రీలో ఈ జంట కలిసి నటించకపోయినా ఒక పాటలో మాత్రం ఆడి పాడారు. నాగార్జున వందో సినిమాలో టబు హీరోయిన్గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శర్వానంద్ - అనుపమ పరమేశ్వరన్
మొదట వీరిద్దరి కాంబినేషన్లో శతమానం భవతి సినిమా వచ్చింది. ప్రస్తుతం భోగి అనే చిత్రం రూపొందుతోంది.






