అఖండ-2 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చిన టాలీవుడ్ నిర్మాత

by Naga Rani Yarlagadda |

అఖండ -2.. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు..

అఖండ-2 ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇచ్చిన టాలీవుడ్ నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: అఖండ -2.. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావలసిన ఈ సినిమా ఊహించని రీతిలో వాయిదా పడింది. సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు బాకీ ఉన్న రూ.28 కోట్లు చెల్లించకపోవడం వల్లే అఖండ-2 రిలీజ్ కు కష్టాలొచ్చాయి.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గుడ్ న్యూస్ చెప్పారు. అఖండ-2 ఇష్యూ క్లియర్ అయిందని, డిసెంబర్ 12న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ ఏడాది హరిహర వీరమల్లు, అఖండ-2 విడుదల విషయంలో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. నిర్మాతలకు గతంలో ఆర్థికపరమైన కమిట్‌మెంట్ల కారణంగా ఈ సమస్యలు వచ్చాయని, ఇప్పుడు అఖండ-2 ఇష్యూ కూడా అలా వచ్చిందేనన్నారు. అఖండ-2 సినిమా కసం అందరూ ఎదురుచూస్తున్నారని, వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేస్తారని తమ్మారెడ్డి తెలిపారు.

Next Story