టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఒకప్పటి హీరోయిన్ జయప్రద ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందాడు.

టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. దయచేసి ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ జయప్రద(Jayaprada) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందాడు. ఆమె ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘నా అన్నయ్య శ్రీ రాజా బాబు మరణవార్తను మీకు తెలియజేస్తున్నందుకు బాధగా అనిపిస్తుంది. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నమూశారు. దయచేసి ఆయన గురించి ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను’’ అని రాసుకొచ్చింది. అలాగే తన అన్నయ్య ఫొటోలను కూడా షేర్ చేసింది.

దీంతో అది చూసిన నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. జయప్రద పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి పనిచయం అయింది. 1976లో ‘సిరి సిరి మువ్వ’(Siri Siri Muvva) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్, శోభన్ బాబు(Shobhan Babu), ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారితో నటించి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. అంతేకాకుండా హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక గత 2018 నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదట తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ తర్వాత నాయకులతో గొడవలు కావడంతో రెండేళ్లకే బయటకు వచ్చేసి సమాజ్ వాది పార్టీలో చేరింది. గత కొద్ది కాలంగా బీజేపీ పార్టీలో ఉంటుంది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘ఫౌజీ’ సినిమా ద్వారా ఇండస్ట్రీ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తుండగా.. ఇప్పటికే ‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా పూర్తి కావడంతో పాటు మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. స్వాతంత్య్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లు టాక్.

Next Story