బడా బిజినెస్ మ్యాన్‌తో మూడు ముళ్లు వేయించుకుని కన్నీళ్లు పెట్టుకున్నటాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ పార్వతి నాయర్(Parvathy Nair) నేచురల్ స్టార్ నాని సరసన ‘జెండాపై కపిరాజు’(Janda Pai Kapiraju) సినిమాలో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

బడా బిజినెస్ మ్యాన్‌తో మూడు ముళ్లు వేయించుకుని కన్నీళ్లు పెట్టుకున్నటాలీవుడ్ హీరోయిన్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పార్వతి నాయర్(Parvathy Nair) నేచురల్ స్టార్ నాని సరసన ‘జెండాపై కపిరాజు’(Janda Pai Kapiraju) సినిమాలో నటించి క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అమ్మడు భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఎంతవాడు గానీ, ఓవర్ టేక్, ది గోట్ వంటి మూవీస్‌లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే పార్వతి బడా బిజినెస్ అశ్రిత్‌ను ప్రేమించింది. కొద్ది కాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

తాజాగా, పార్వతి తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. వీరిద్దరు కుటుంబ సభ్యుల మధ్యలో చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలు షేర్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్‌(Ashrith)తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతేకాకుండా అత్యంత అందమైన పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మీరే అని గార్జియస్, బ్యూటిఫుల్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక పార్వతి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story