తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ షవర్ అంటూ భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ(పోస్ట్)

by Gugulothu.Kavitha |

ప్రముఖ హీరోయిన్ గాబ్రియెల్లా(Gabriella) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ ‘సుందరి(Sundari) సీరియల్‌లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది.

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ షవర్ అంటూ భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరోయిన్ గాబ్రియెల్లా(Gabriella) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ ‘సుందరి(Sundari) సీరియల్‌లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది.ఇందులో సుందరి దేవిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాపులారిటీతో వెండి తెరపై కూడా నటించే చాన్స్ కొట్టేసింది. అలా రజనీకాంత్(Rajinikanth) నటించిన ‘కబాలి(Kabali) మూవీలో గెస్ట్ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత ‘కాంచన-3’(Kanchana-3), ‘కట్టు మారం’(Kattu Maram), ‘ఎన్-4’(N4), ‘ఐరా’(Aira) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆకాశ్(Akash) అనే వ్యక్తితో మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ఇక అప్పటి నుంచి ఓ పక్క సినిమాలు, మరొపక్క మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటే గాబ్రియెల్లా.. తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తను తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే తనకు సీమంతం జరిగిన ఫొటోలు, తన భర్తతో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ‘బేబీ షవర్’(Baby Shower) అనే క్యాప్షన్ జోడింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు, సెలబ్రిటీస్, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ బేబీ షవర్ ఫొటోస్‌పై ఓ లుక్ వేసేయండి.

Next Story