- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి నాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. సింహం వచ్చేసిందంటూ పోస్ట్
ప్రముఖ హీరోయిన్ హరిప్రియ(Haripriya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ప్రముఖ హీరోయిన్ హరిప్రియ(Haripriya) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు నాని ‘పిల్ల జమిందార్’(Pilla Zamindar) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్(Abbai Class Ammayi Mass), జై సింహా, అంజని పుత్ర, అలా ఇలా ఎలా, ఈ వర్షం సాక్షిగా వంటి చిత్రాలతో తెలుగు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో అమ్మడు ప్రేక్షకులను అలరించింది.
ఇక కేజీఎఫ్(KGF) నటుడు వశిష్ఠ(Vasishta N. Simha)ను ప్రేమించింది. పెద్దలను ఒప్పించి 2023 జనవరి 26న గ్రాండ్‌గా వివాహం చేసుకున్న వీరిద్దరూ ఇటీవల తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. హరిప్రియ(Haripriya) ప్రెగ్నెంట్ అయిన తర్వాత సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన బేబీ బంప్(Baby bump) ఫొటోలు షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, హరిప్రియ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. హరిప్రియ, వశిష్ఠ సింహ పెళ్లి రోజునే వారు అమ్మానాన్నగా ప్రమోషన్ పొందారు.
అయితే ఈ జంట 2023 జనవరి 26న వివాహం చేసుకున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత, అంటే జనవరి 26, 2025న పండంటి మగ బిడ్డ వారి జీవితంలోకి అడుగు పెట్టాడు. ‘‘మా పెళ్లి రోజునే ప్రిన్స్ వచ్చాడు’’ అనే క్యాప్షన్ జత చేసి సింహం ఫొటో(Photo)ను షేర్ చేసింది. అయితే ఈ జంటకు కుటుంబ సభ్యులు, బంధువులు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. బెంగుళూరు(Bangalore)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హరిప్రియ చేసి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






