Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-14 09:40:30  IST  )

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) తాజాగా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారిని దర్శించుకున్నారు.

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) తాజాగా తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఫ్యామిలీతో వచ్చిన ఈ హీరోయిన్‌కు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత పలువురు భక్తులు మీనాక్షితో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా మీనాక్షి చౌదరి రీసెంట్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankrathiki Vasthunnam) మూవీతో మన ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ సినిమాలో వెంకటేష్(Venkatesh) హీరోగా నటించాడు. అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించింది. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలాగే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం మీనాక్షి ఒకటి, రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.

Next Story