అలాంటి సమస్యతో బాధపడుతున్నPayal Rajput.. అంతా దేవుడి దయ అంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-18 10:15:45  IST  )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)‘ఆర్ఎక్స్-100’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

అలాంటి సమస్యతో బాధపడుతున్నPayal Rajput.. అంతా దేవుడి దయ అంటూ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) ‘ఆర్ఎక్స్-100’ సినిమాతో వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక మొదటి ప్రాజెక్ట్‌తోనే అమ్మడు రేంజ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత వెంకీ మామ, తీస్ మార్ ఖాన్(Tees Mar Khan), మంగళవారం(Mangalavaaram) వంటి చిత్రాల్లో నటించి హిట్ సాధించింది. ప్రస్తుతం పాయల్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachchimi) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక షూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా పాయల్ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు ఓ చెప్పుకోలేని సమస్య వచ్చినట్లు వెల్లడించింది. ‘‘ప్రస్తుతం నాకు కంటి సమస్య వచ్చింది.

దాని పేరు కూడా సరిగ్గా పలకలేకపోతోన్నాను.. నా కంటికి ఇప్పుడు ఏదీ కూడా సరిగ్గా కనిపించడం లేదు.. అన్నీ రెండు రెండు కనిపిస్తున్నాయి.. కాస్త బ్లర్డ్‌గా కనిపిస్తున్నాయి..పరిస్థితి ఎలా ఉన్నా కూడా.. ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్‌కి అనుగుణంగా ఈవెంట్‌కు వెళ్లాల్సిందే.. ఇక అక్కడ ఎలా మ్యానేజ్ చేయాలో.. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందో.. అంతా ఆ దేవుడి దయ. అయినా ఇప్పుడు ఈ కళ్లద్దాలు పెట్టి మ్యానేజ్ చేస్తాను. కనిపించకపోతే ఏం నటించగలను కదా?’’ అని చెప్పుకొచ్చిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన నెటిజన్లు, అభిమానులు అసలు ఆమెకు ఏమైందో అర్ధంకాక తెగ కంగారు పడిపోతున్నారు.

Next Story