గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో 'గౌతమ్ SSC' హీరోయిన్

by velandi.Saikiran |

సింధు తులాని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. తాజాగా ఆమె ఫోటోలు వైర‌ల్ గా మారాయి. ఈ ఫోటోల్లో బాగా పరిశీలిస్తూ చూస్తే, తప్ప ఆమెను మనం గుర్తించలేం. అంతలా ఆమె ముఖం మారిపోయింది.

గుర్తుప‌ట్ట‌లేని స్థితిలో గౌతమ్ SSC హీరోయిన్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు అప్పట్లో సినిమాలు చేసి కనుమరుగు అయిపోయిన వారు ఉన్నారు. మరి కొంతమంది అప్పుడప్పుడు మెరుస్తూ, మేం కూడా ఉన్నామని గుర్తు చేస్తున్నారు. అలాంటి వారిలో సింధు తులాని ( Sindhu Tolani) ఒకరు. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో కంటే ఇప్పుడు కాస్త బొద్దుగా తయారైన సింధు తులాని, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. బాగా పరిశీలిస్తూ చూస్తే, తప్ప ఆమెను మనం గుర్తించలేం. అంతలా ఆమె ముఖం మారిపోయింది. కాగా అప్పట్లో మన్మధ, గౌతమ్ SSC, అతనొక్కడే ఇలాంటి తెలుగు సినిమాల్లో నటించి బంపర్ విజయాలను అందుకున్నారు సింధు తలాని. కాగా ఇప్పుడు ఆమె ఫ్యామిలీతో ముంబైలో నివాసం ఉంటున్నారట. తన రీ-ఎంట్రీలో ఆంధ్ర కింగ్ తాలూకాలో స్పెషల్ రోల్ లో కనిపించారు సింధు తులాని.

Next Story