భర్తను ముద్దులతో ముంచేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..

by I. Sairam |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భర్తను ముద్దులతో ముంచేస్తున్న టాలీవుడ్ హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మీ కళ్యాణం’(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది.

ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఓ బాబుకు జన్మ కూడా నిచ్చింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ‘సత్యభామ’(Satyabhama) మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా ‘సికిందర్’(Sikinder) సినిమాతో మనముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఈ బ్యూటీ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కాజల్ అండ్ తన భర్తకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఈ ముద్దుగుమ్మ తన భర్తను ముద్దులు, హగ్గులతో ముంచేస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు బెస్ట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story